నిజంనిప్పులాంటిది

May 24 2023, 17:13

Satya kumar: 'కోడికత్తి' తరహాలో అవినాష్‌రెడ్డి డ్రామా: భాజపా నేత సత్యకుమార్‌

తిరుపతి: నాలుగేళ్లలో సీఎం జగన్‌ నమ్మకద్రోహంతో నయవంచక పాలన అందించారని భాజపా జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌ విమర్శించారు. రాజధాని అంశంతో పాటు రైతు భరోసా, పంటల బీమా, మద్దతు ధర, బిందు సేద్యం తదితర అంశాల్లో సీఎం మోసం చేశారని ఆరోపించారు..

రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని ఆయన విమర్శించారు. తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో సత్యకుమార్‌ మాట్లాడారు. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి.. దారిదోపిడీకి మించిపోయిందన్నారు.

పంచభూతాల్లో ఏ ఒక్కదాన్నీ వదలకుండా వైకాపా నేతలు దోచుకుంటున్నారని ఆరోపించారు. 'కోడికత్తి' తరహాలో ఎంపీ అవినాష్‌రెడ్డి డ్రామా కొనసాగుతోందని ఎద్దేవా చేశారు.

''మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ విచారణకు అవినాష్‌రెడ్డి సహకరించడం లేదు. సీబీఐకి రాష్ట్ర పోలీసులు సహకరించకుండా వ్యవహరిస్తున్న తీరు ప్రజాస్వామ్యానికి మంచిదికాదు.

అవినాష్‌ అరెస్ట్‌ ఖాయం. వైకాపాలో సంస్కారం లేని వ్యక్తులు భాజపాపై విమర్శలు చేస్తున్నారు. యువతకు మెగా డీఎస్సీ అని జగన్‌ నమ్మకద్రోహం చేశారు. రాష్ట్రంలో రీసర్వే పేరుతో అటవీ, వివాదాస్పద, ప్రభుత్వ భూములను గుర్

నిజంనిప్పులాంటిది

May 24 2023, 17:11

కల్తీ కనికట్టు కనిపెట్టేది : ఎవరు❓️

కల్తీ తిండిలో మనమే టాప్

సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా రిపోర్టులో వెల్లడి

రాష్ట్రంలో కల్తీ ఫుడ్ పెరిగిపోతున్నది. పాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, వంట నూనె, ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్.. ఇట్ల ప్రతీది కల్తీ అవుతున్నది. ఆహార పదార్థాల్లో కల్తీని అరికట్టడంలో సర్కార్ విఫలమవుతున్నది. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఫుడ్ సేఫ్టీ విషయంలో మన రాష్ట్రం చివర్లో ఉన్నది. ఫుడ్ సేఫ్టీలో 17 పెద్ద రాష్ట్రాలతో పోలిస్తే 15వ స్థానానికి దిగజారింది. అంటే కల్తీ ఫుడ్ ఎక్కువున్న రాష్ట్రాల జాబితాలో టాప్ 3లో ఉన్నదన్నట్టు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) ఇటీవల విడుదల చేసిన రిపోర్టులో ఈ విషయం వెల్లడైంది.

దేశవ్యాప్తంగా ఫుడ్ సేఫ్టీపై సర్వే చేసిన ఎఫ్ఎస్ఎస్ఏఐ.. పెద్ద రాష్ట్రాలు, చిన్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వారీగా రిపోర్టులు ఇచ్చింది. పెద్ద రాష్ట్రాల జాబితాలో ఒడిశా, ఉత్తరప్రదేశ్, అస్సాం, ఉత్తరాఖండ్ తదితర రాష్ట్రాల కంటే తెలంగాణలో ఫుడ్ కల్తీ ఎక్కువగా ఉన్నట్టు రిపోర్టులో తేలింది. మరోవైపు ఫుడ్ క్వాలిటీ చెకింగ్ లోనూ రాష్ట్రం వెనుకబడిందని వెల్లడైంది. కల్తీ ఫుడ్ ను అరికట్టేందుకు కఠిన చట్టం తీసుకొస్తామని గొప్పగా చెప్పిన సర్కార్.. ఆరేండ్లయితున్నా అందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కనీసం ఫుడ్ కల్తీపైనా ప్రచారం నిర్వహించి ప్రజలకు అవగాహన కూడా కల్పించడం లేదు. మార్కెట్ లోకి విచ్చలవిడిగా వస్తున్న కల్తీ ప్రొడక్ట్స్ కొనుగోలు చేసి జనం అనారోగ్యానికి గురవుతున్నారు. క్యాన్సర్, గుండె, కిడ్నీ, లివర్ తదితర రోగాల బారినపడుతున్నారు.

ఫుడ్ క్వాలిటీ టెస్టుల్లేవ్..

ఫుడ్ క్వాలిటీ చెకింగ్ లోనూ మన రాష్ట్రం వెనుకబడింది. ఇందులో 20 పాయింట్లకు గాను తెలంగాణకు 3.5 పాయింట్లే వచ్చాయి. తమిళనాడుకు 10 పాయింట్లు, మిగిలిన రాష్ట్రాలు కూడా మంచి పాయింట్లతో ముందున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడా ఫుడ్ క్వాలిటీ టెస్టులు చేయడం లేదు.

హోటళ్లు, స్ట్రీట్ ఫుడ్ సెంటర్లలో కల్తీ నూనెలు వాడుతున్నారు. వాడిన నూనెనే మళ్లీ మళ్లీ వినియోగిస్తున్నారు. దీంతో క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. అయినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. పెద్ద పెద్ద ప్రైవేట్ హోటళ్ల వైపు కనీసం కన్నెత్తి కూడా చూడటం లేదు. మాంసం విక్రయ కేంద్రాల్లోనూ క్వాలిటీ చెకింగ్ ఉండటం లేదు. ప్రభుత్వ ఆధ్వర్యంలో అందించే ఫుడ్ విషయంలోనూ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.

ప్రభుత్వ హాస్పిటళ్లలో పేషెంట్లకు అందిస్తున్న ఆహారం, పాలు, పండ్లు, గుడ్లు, ఇతర పదార్థాల నాణ్యతను పట్టించుకోవడం లేదు. గురుకుల హాస్టళ్లలోనూ తనిఖీలు చేపట్టడం లేదు. కల్తీ ఫుడ్ కారణంగా విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్న సంఘటనలు తరచూ జరుగుతున్నా పట్టించుకోవడం లేదు. మేడ్చల్ జిల్లా చెంగిచెర్లలోని స్లాటర్​హౌస్ కు ప్రభుత్వ గుర్తింపు ఉంది. ఇక్కడ రోజుకు 3 వేల గొర్రెలను కోస్తారు. ప్రతిరోజూ ఇక్కడ ర్యాండమ్ గా మాంసానికి క్వాలిటీ టెస్టులు చేయాలి. కానీ నామమాత్రంగానే టెస్టులు జరుగుతున్నట్లు చెబుతున్నారు...

నిజంనిప్పులాంటిది

May 24 2023, 17:03

Tirumala: తిరుమల ఘాట్‌ రోడ్డులో బస్సు బోల్తా

తిరుమల: తిరుమల నుంచి తిరుపతికి భక్తులతో వెళ్తున్న ఎలక్ట్రిక్‌ బస్సు బుధవారం మధ్యాహ్నం బోల్తా పడింది. తిరుమల నుంచి వస్తుండగా.. మొదటి ఘాట్‌రోడ్డులోని 29, 30 మలుపు వద్దకు రాగానే డివైడర్‌ను ఢీకొన్న బస్సు లోయలోకి దూసుకెళ్లింది..

ప్రమాద సమయంలో బస్సులో 45 మంది భక్తులు ప్రయాణిస్తున్నారు. ఘటన జరిగిన సమయంలో విధులు ముగించుకొని అదే మార్గంలో వెళ్తున్న ఎస్పీఎఫ్‌ సిబ్బంది అప్రమత్తమయ్యారు.

వెంటనే ప్రమాదానికి గురైన బస్సు అద్దాలను ధ్వంసం చేసి భక్తులను కాపాడారు. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్‌, పలువురు భక్తులు స్వల్పంగా గాయపడ్డారు. గాయపడిన వారిని రుయా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

తిరుమల ఘాట్‌ రోడ్డులో ప్రమాద ఘటనపై ఈవో ధర్మారెడ్డి విచారణకు ఆదేశించారు. ఆర్టీసీ ఎండీతో పాటు ఎలక్ట్రిక్‌ బస్సులు సరఫరా చేస్తున్న ఒలేక్ట్రా కంపెనీ ప్రతినిధులతోనూ ఈవో మాట్లాడారు.

ప్రస్తుతం తితిదే వద్ద 10, ఆర్టీసీ వద్ద 65 ఎలక్ట్రిక్‌ బస్సులు ఉన్న నేపథ్యంలో భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.

నిజంనిప్పులాంటిది

May 24 2023, 17:00

మరో ప్రాణాంతక మహమ్మారిని ఎదుర్కొనేందుకు సిద్ధంకండి'

ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) అధిపతి టెడ్రోస్‌ అధనామ్‌ ఘెబ్రేయేసస్‌ కోవిడ్‌-19 మహమ్మారి కంటే ప్రాణాంతకమైన తదుపరి మహమ్మారి కోసం ప్రపంచం సిద్ధంగా ఉండాలని హెచ్చరిక జారీ చేశారు.

గ్లోబల్‌ హెల్త్‌ ఎమర్జెన్సీ కోవిడ్‌-19 ముగింపు అంటే ప్రపంచ ఆరోగ్య ముప్పుగా ఉన్న కోవిడ్‌ 19కి ముగింపు కాదని టెడ్రోస్‌ చెప్పారు. సోమవారం జరిగిన 76వ ప్రపంచ ఆరోగ్య సభ్యకు తన నివేదికను సమర్పించిన సందర్భంగా డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్‌ ఈ విషయాన్ని తెలిపారు.

వాస్తవానికి ఆ మహమ్మారి వ్యాప్తి చెందుతూ..తొలుత ప్రాణాంతకంగా మారిని తదనంతరం ఉనికిని వివిధ వేరియంట్లగా మార్చుకుంటూ మనం ఎదుర్కున్న తీవ్రత గల ముప్పుగా పరిణిమించలేదు.

అయినప్పటికీ ఇది అత్యవసర పరిస్థితులను పరిష్కరించి..సాధ్యమైనంత త్వరగా ప్రతిస్పందించేలా ప్రభావవంతమైన ప్రపంచ యంత్రాగాలు అవసరాన్ని గురించి నొక్కి చెప్పారు.

సస్టైనబుల్‌ డెవలప్‌మెంట్‌ గోల్స్‌(ఎస్‌డీజీలు) కింద ఆరోగ్య సంబంధిత లక్ష్యాలు 2030ని మరింతగా అమలు చేయాల్సిన ప్రాముఖ్యతను ఈ కోవిడ్‌ 19 మహమ్మారి తెలియజెప్పిందన్నారు.

నిజంనిప్పులాంటిది

May 24 2023, 16:59

New Parliament: కొత్త పార్లమెంటు ప్రారంభోత్సవంపై 19 విపక్ష పార్టీల కీలక నిర్ణయం

న్యూఢిల్లీ: ఈనెల 28న జరగబోయే కొత్త పార్లమెంటు భవనం (New Parliament Buiding) ప్రారంభోత్సవాన్ని బహిష్కరిస్తున్నట్టు విపక్ష పార్టీలు ప్రకటించాయి..

రాజ్యాంగ అధినేతగా రాష్ట్రపతి కాకుండా ప్రధానమంత్రి మోదీ పార్లమెంటు భవనాన్ని ప్రారంభించనుండటం ప్రజాస్వామ్యాన్ని అవమానించడమేనని, పార్లమెంటుకు ఆత్మ వంటి ప్రజాస్వామ్యానికే చోటు లేనప్పుడు కొత్త భవనానికి ఇక ఎలాంటి విలువా లేదని పేర్కొంటూ 19 విపక్ష పార్టీలు (Opposition parties) బుధవారంనాడు సంయుక్త ప్రకటన విడుదల చేశాయి..

19 పార్టీలు ఇవే...

కొత్త పార్లమెంటు భవన ప్రారంభోత్సవాన్ని బష్కరిస్తున్నట్టు ప్రకటించిన 19 పార్టీల్లో కాంగ్రెస్, డీఎంకే, ఆప్, శివసేన (యూబీటీ), సమాజ్‌వాదీ పార్టీ, సీపీఐ, జార్ఖాండ్ ముక్తి మోర్చా, కేరళ కాంగ్రెస్ (మణి), విడుదలై చిరుతైగళ్ కట్చి, రాష్ట్రీయ లోక్‌ దళ్, తృణమూల్ కాంగ్రెస్, జనతాదళ్ (యునైటెడ్), ఎన్‌సీపీ, సీపీఎం, ఆర్జేడీ, ఇండియన్ యూనయన్ ముస్లిం లీగ్, నేషనల్ కాన్ఫరెన్స్, రివల్యూషరీ సోషలిస్ట్ పార్టీ, ఎండీఎంకే ఉన్నాయి..

SB NEWS

SB NEWS

నిజంనిప్పులాంటిది

May 24 2023, 12:24

PM Modi : 'మా బంధాన్ని దెబ్బతీయాలని చూస్తే సహించం': ఆ ఘటనలపై మోదీ హెచ్చరిక

దిల్లీ: ఆరు రోజుల పర్యటనలో భాగంగా ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉన్న ప్రధాని మోదీ(PM Modi) తన పర్యటనను విజయవంతంగా కొనసాగిస్తున్నారు..

ఈ సందర్భంగా ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్‌(Australian PM Anthony Albanese), మోదీ బుధవారం పలు అంశాలపై చర్చలు జరిపారు. ఈ మధ్యకాలంలో ఆ దేశంలో హిందూ ఆలయాలు, ప్రార్థనా మందిరాలపై జరుగుతోన్న దాడులు వారి మధ్య చర్చకు వచ్చాయి..

'ఆస్టేలియా(Australia)లో ప్రార్థనాస్థలాలపై జరుగుతోన్న దాడులు, వేర్పాటువాద శక్తుల కార్యకలాపాల గురించి అల్బనీస్‌, నేను గతంలో చర్చించాం.

ఇప్పుడు కూడా ఆ అంశం మా మధ్య ప్రస్తావనకు వచ్చింది. ఈ రెండు దేశాల మధ్య ఉన్న స్నేహపూర్వక సంబంధాలకు హానికలిగించే చర్యలను మేం ఏ మాత్రం అంగీకరించం.

అలాంటి మూకలపై కఠిన చర్యలు తీసుకుంటామని అల్బనీస్‌ మరోసారి హామీ ఇచ్చారు' అని మోదీ వెల్లడించారు. ఇక ఈ ఇద్దరు నేతలు పునరుత్పాదక ఇంధనం, వాణిజ్యం, రక్షణ రంగాలకు చెందిన పలు అంశాలపై చర్చించారు..

నిజంనిప్పులాంటిది

May 24 2023, 12:23

Hyderabad: నకిలీ ఐపీఎస్ ఆఫీసర్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు

హైదరాబాద్: నకిలీ ఐపీఎస్ (Fake IPS) ఆఫీసర్‌ను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. రామ్ ఐపీఎస్ పేరుతో చలామణి అవుతూ.. పలు రాష్ట్రాల్లో మోసాలకు పాల్పడుతున్నాడు..

ఉద్యోగాలు కేంద్ర ప్రభుత్వంలో పదవులు సెటిల్‌మెంట్ల పేర్లతో మోసాలు చేస్తున్నాడు. సైబరాబాద్‌లో ఏకంగా కార్యాలయమే తెరిచి.. బాధితులను కార్యాలయానికి పిలిపించి సెటిల్‌మెంట్స్ చేస్తున్నాడు. బాధితులకు ఇంటరాగేషన్ పేరుతో చుక్కలు చూపెడుతున్నాడు.

ప్రత్యేక పోలీస్ అధికారి పేరుతో నకిలీ ఐపీఎస్ రామ్ వ్యవహారం నడుపుతున్నాడు. హైదరాబాద్ చెందిన మహిళను ట్రాప్ చేసిన విషయం పోలీసుల దర్యాప్తులో వెలుగు చూసింది.

జాగ్వర్ కార్లను అతి తక్కువ ధరకు ఇప్పిస్తానని మోసానికి పాల్పడ్డాడు. పోలీస్ విచారణ పేరుతో చాలామందిని చిత్రహింసలకు గురిచేశాడు. తుపాకులు, పోలీస్ వాహనాల, సైరన్లను వేసి బెంబేలు సృష్టించాడు.

సమాచారం అందుకున్న సైబరాబాద్ పోలీసులు నకిలీ ఐపీఎస్ రామ్‌ని అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు. ఎవరెవరి నుంచి ఎంత మొత్తం డబ్బులు వసూలు చేసింది.. తదితర అంశాలపై దర్యాప్తు చేస్తున్నారు..

నిజంనిప్పులాంటిది

May 24 2023, 12:22

Amaravati: తుళ్లూరు దీక్షా శిబిరం వద్ద ఉద్రిక్తత.. మహిళలు, వృద్ధులను పోలీసులు లాగి పడేశారు!

గుంటూరు: గుంటూరు జిల్లా తుళ్లూరులో అధికార, ప్రతిపక్ష పార్టీలు ర్యాలీలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు 144 సెక్షన్ విధించారు.

ఆర్-5 జోన్‌కు వ్యతిరేకంగా తుళ్లూరు దీక్షా శిబిరంలో గుంటూరు జిల్లా తెదేపా అధ్యక్షుడు తెనాలి శ్రావణ్ కుమార్ నిరసన దీక్షకు పిలుపునిచ్చారు..

అయినప్పటికీ ఆర్-5 జోన్‌కు వ్యతిరేకంగా తుళ్లూరులో తెదేపా ఆధ్వర్యంలో రైతులు నిరసన దీక్ష చేపట్టారు. అప్పటికే దీక్షా శిబిరం వద్ద పోలీసులు వందల సంఖ్యలో మోహరించారు. ర్యాలీలు, నిరసనలకు అనుమతి లేదంటూ.. రైతులను పోలీసులు అరెస్టు చేశారు.

మహిళలు, వృద్ధులు అని కూడా చూడకుండా పోలీసులు వారిని లాగి పడేశారు. హైకోర్టు సీనియర్ న్యాయవాది, జై భీమ్ భారత్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రావణ్ కుమార్‌నూ పోలీసులు అరెస్టు చేశారు. దీంతో దీక్షా శిబిరం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. శాంతియుతంగా దీక్ష చేపడుతుంటే అడ్డంకులేంటని రైతులు ప్రశ్నిస్తున్నారు. అరెస్టు చేసిన రైతులు, మహిళలను బలవంతంగా వాహనాలు ఎక్కించి తుళ్లూరు పీఎస్‌కు తరలించారు..

దీక్షా శిబిరంలోకి ఎవరినీ వెళ్లనీయకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. రోజువారీ నిరసనలకు కూడా అనుమతి లేదని పోలీసులు తేల్చి చెబుతున్నారు. ఎవరొచ్చినా సరే బలవంతంగా అరెస్టు చేస్తామని తేల్చి చెబుతున్నారు. మరోవైపు తుళ్లూరు మండలంలో తెదేపా నేతలను పోలీసులు గృహ నిర్బంధం చేశారు..

నిజంనిప్పులాంటిది

May 24 2023, 09:45

హైదరాబాద్, విశాఖలో భారీ గా ఐటి సోదాలు

హైదరాబాద్, విశాఖలలో నేడు ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌లో వచ్చేసి.. కోహినూర్ డెవలపర్స్, రియల్ ఎస్టేట్ కంపెనీలపై ఐటీ సోదాలు నిర్వహిస్తోంది.

ఆదాయ చెల్లింపుల విషయంలో అవకతవకలు పాల్పడ్డారని ఆరోపణలు వెల్లువెత్తడంతో ఈ రోజు ఏక కాలంలో 20 బృందాలతో ఐటీ సోదాలు నిర్వహిస్తోంది. హైదరాబాద్‌లో 20 కి పైగా ప్రాంతాల్లో ఐటీ తనిఖీలు నిర్వహిస్తోంది. రియల్ ఎస్టేట్ , ఫార్మా , ఇన్ఫ్రా కంపెనీలపై ఐటీ దాడులు నిర్వహిస్తోంది.

విశాఖలో సైతం ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి. పలు ఫార్మా కంపెనీలు, వాటి డైరక్టర్ల ఇళ్లలో సోదాలు ఐటీ శాఖ సోదాలు నిర్వహిస్తోంది. ఏకకాలంలో పదికి పైగా చోట్ల సోదాలు జరుగుతున్నాయి. విశాఖలో 15 ఐటీ బృందాలు సోదాలు నిర్వహిస్తున్నాయి...

SB NEWS

SB NEWS!

నిజంనిప్పులాంటిది

May 24 2023, 09:43

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

తిరుపతి :

తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. నేడు బుధవారం స్వామివారి దర్శనం కోసం భక్తులు 20 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది.

మంగళవారం స్వామివారిని 75,875 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.07 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది.

స్వామివారికి 35,439 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నేడు 300 దర్శన టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేయనుంది. జులై, ఆగస్ట్‌ కోటాను ఉదయం 10 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది....

SB NEWS

SB NEWS